చక్రాల భూతాలు
బుడిబుడి అడుగులేస్తూ బంగారుతల్లి బడికెళ్ల్లిపోతుంది.బిడ్డ చదువుకోడానికి వెళ్లినా, ఆడుకోడానికెళ్లినా..అమ్మ మనసెప్పుడూ ఆ చిన్నారి చుట్టే.కలలైన కలవరింతలైనా ఆ పసిదాని గురించే.పెద్దయ్యాక ఎంత పెద్ద ఉద్యోగం చేస్తుందో,ఎన్ని రాజ్యాలేలుతుందో!
డాక్టరైతే బావుండు.తెల్లకోటులో రాజహంసలా ఉంటుంది.మందులు మాకులు ఎందుకు? నా తల్లి చిరునవ్వు చాలు,ఏ రోగమైన క్షణాల్లో నయమైపోతుంది.
కాదుకాదు, నా బిడ్డ కలెక్టరు కావాలి.
బుజ్జి కార్లోంచి దర్జాగా దిగుతుంటే, బిళ్లబంట్రోతులు దండాలు పెట్టాలి.
పెద్దపెద్ద ఆఫిసర్లు పరిగెత్తుకు రావాలి.
రెండూ వద్దు. చిన్నారి మహాసుకుమారి.
అంత ఒత్తిడి భరించలేదు.హాయిగా ఏ ఇంజినీర్ అయితే బావుండు.
ఏసి ఆఫిసులో కూర్చోని ప్రశాంతంగా పనిచేసుకుంటుంది.లక్షల జీతం.చీకూచింతాలేని జీవితం.
అమ్మ మనసులో కమ్మకమ్మని ఆలోచనలు.
హఠాత్తుగా , నిర్దయగా , నిమిషాల్లోనే....
ఆ కలల్ని ఎవరో చిదిమేస్తారు. ఆ ఊహల్ని ఎవరో నలిపేస్తారు.
డాక్టరో కలెక్టరో కాదు....
సాయంత్రానికెల్లా శవమవుతుంది!
నడిరోడ్డు మీద...నిర్జీవంగా! చిందరవందరగా పుస్తకాలు.ముత్యాల దస్తూరీ మీద రక్తపు మరకలు.
ఓ మూలన నుజ్జునుజ్జయిన టిఫీను డబ్బా. మట్టిలో కలసిపోయిన ఇష్టమైన చిరుతిళ్లు.అడ్రసు చెప్పడానికే అన్నట్లు, గుర్తింపుకార్డు మాత్రం భద్రంగా మెడలో వేలాడుతూ.
ఆ వార్త తెలిసి అమ్మ గుండె పగిలిపోతుంది. నాన్న శ్వాస ఆగిపోతుంది. ఆ ఇల్లు శ్మశానమవుతుంది.
ఆ చావుకు కారణం ఎవరు? ఆ హత్యలో హంతకులెవరు?
వెనకాముందూ చూడకుండా రివ్వున దూసుకెళ్లిపోయే ఆటోవాలా.
స్పోర్ట్స్ బైకుతో విన్యాసాలు చేసె టీనేజీ కుర్రాడు.ట్రాఫిక్ నిబంధనల్ని పట్టించుకోని ఉద్యోగి.
డొక్కు ట్రక్కును బలవంతంగా రోడ్డెక్కించే డ్రైవరు.కిక్కు తలకెక్కి కళ్లుమూసుకుపోయిన మద్యం బానిస.
చలాన్ల వసూళ్లలోపడి అసలు బాధ్యత మరచిపోయిన కానిస్టేబుల్.
మొహమైన చూడకుండ లైసెన్సు మంజూరు చేసిన మాముళ్ల ఆర్టీఏ అధికారి.
నాణ్యతలేని రోడ్డేసిన కాంట్రాక్టరు.వాటాలకు కక్కుర్తిపడిన రాజకీయనాయకుడు...
ఆ జాబితా చాలా పెద్దది.
నిమిషానికొక్కటి చొప్పున జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు సమాజానిదే బాధ్యత.
మనం కాస్త జాగ్రత్తగా ఉంటే,కాస్త నిజాయితీగా వ్యవహరిస్తే, కాస్త తొందరపాటు తగ్గించుకుంటే, కాస్త వేగాన్ని అదుపుచేసుకుంటే ఇన్ని ఘోరాలు జరగవు.
తొంభైశాతం రోడ్డు ప్రమాదాలకు మానవతప్పిదాలే కారణం. మిగిలిన పదిశాతం సాంకేతికమైనవి.

అరె.. ఆ స్పీడేమిటి? ఎవరో తరుముకొస్తున్నట్టు.ఎక్కడో కొంపలు మునిగిపోయినట్టు.కాస్త నిదానంగా వెళ్లండి.మహా అయితే ఏం జరుగుతుంది? ఆఫీసుకు ఐదునిమిషాలు ఆలస్యమౌతుంద్, ఓ పూట జీతానికి కోతపడుతుంది.ఓ ఆదివారం సకుటుంబంగా రెస్టారెంట్లో భోంచేశామనుకోండి. మీరు కలవాల్సిన ఖాతాదారుడిని సకాలంలో కలసుకోలేరు. ' సారీ ' చెప్పేస్తే సరి.క్లాసులో పాఠాలు మొదలవుతాయి.సహపాఠీ దగ్గర నోట్స్ తీసుకుంటే ఇబ్బందే లేదు. ప్రియురాలు ఎదురుచూస్తూ ఉంటుంది.ఓ డైరిమిల్క్ చాక్లెట్ పట్టుకెల్తే సరి.
ఇంతేనా , ఇంతకంటే కొంపలుమునిగే కార్యక్రమాలేమైనా ఉన్నయా? మీరు మాట తప్పిన పాపానికి బ్రహ్మాండమేం బద్దలైపోదు. మీరు ఆలస్యం చేసినందుకు సప్తసముద్రాలేమి ఇంకిపోవు. కాలం విషయంలో అంత ఖచ్చితంగా ఉండాలనుకుంటే , ఓ అరగంట ముందే నిద్రలేవండి.ఓ పదినిమిషాల ముందే బయల్దెరండి.నింపాదిగా పనులు చేసుకోవచ్చు.నిదానంగా వెళ్లొచ్చు. ఆలస్యంగా పడుకుంటారు, ఆలస్యంగా లేస్తారు. ఆలస్యంగా బయల్దేరతారు. ఆ సమయాన్ని సర్దుబాటు చేసుకోవడానికి స్పీడో మీటరే దొరికిందా? పదిహేను నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యానికి, ఐదు నిమిషల్లో వెళ్లిపోదామనే! ఎంత దురాశ?

తప్పదు, మీకో నిజం చెప్పాలి.నిష్ఠూరంగా అనిపించిన సరే.
మీ బండి వేగం ఎంత పెరిగితే..
మరణానికి మీరంత దగ్గరవుతున్నట్టు..
వేగమే శత్రువు.
వేగమే మృత్యువు.
వేగంలో మీ మీదా మీ వాహనం మీదా మీకంటూ నియంత్రణ ఉండదు.ఎక్కడ ఏ తేడా వచ్చినా ఘోర ప్రమాదం జరిగిపోతుంది. ఫలితాలు ఎలా అయిన ఉండొచ్చు. చిన్నచిన్న గాయాలతో తప్పించుకోవచ్చు.కాలో చెయ్యో విరిగినా విరగొచ్చు. ప్రాణానికే ప్రమాదం రావచ్చు.ఎందుకంత కష్టం? చిన్నప్పట్నుంచి ఆర్టీసి బస్సుల మీద చూస్తున్ననినాదాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోండి.
నిదానమే ప్రధానం!
ఎంత గొప్పమాట.

ఏ మహానుభావుడైనా వెనకనుంచీ మహా స్పీడుగా దూసుకొస్తున్నా, మిరేం పట్టించుకోకండి.అస్సలు పోటిపడకండి.దాటుకెళ్లే ప్రయత్నం చేయకండి. లక్ష్యాల పరుగులోనో ఉద్యోగాల ఉరుకులోనో ఎప్పుడైన బండిని దౌడుతీయించాల్సి వచ్చినా...యాక్సిలేటర్ తిప్పుతున్న ప్రతీసారీ...మీరు బాగా ప్రేమించే వ్యక్తిని తలచుకోండి.
అమ్మానాన్నలు కావచ్చు. శ్రీమతి కావచ్చు.
పిల్లలు కావచ్చు.స్నేహితులు కావచ్చు.
పిల్లలు కావచ్చు.స్నేహితులు కావచ్చు.
' జాగ్రత్త నాయనా! ' అమ్మ మాటలు గుర్తున్నాయా?
' సాయంత్రం తొందరగా రండి ' శ్రీమతి విజ్ఞప్తిని మరచిపోయారా?
' డాడి! ఐస్ క్రీమ్ తీసుకురా?!... ' బిడ్డ కోరిక తీర్చరా?
వాళ్లంతా...
మీ కోసమే చూస్తుంటారు.
మిమ్మల్ని తీసుకొచ్చే అంబులెన్స్ కోసం కాదు.
*******************************

' మనకు ట్రాఫిక్ సిగ్నళ్లంటే మంట. కానిస్టేబుల్ కనిపిస్తేనే చిరాకు. ఎర్రలైటు పడగానే ఎందుకాపాలి? చేయి చూపించగానే బ్రేకులెందుకు వేయాలి? సీటుబెల్టు పెట్టుకోకపోతే ఫైనేస్తారా? కట్టేస్తా! మాకూ మంత్రులు తెలుసు,పోలిస్ ఆఫిసర్లు తెల్సు. '
ఇదీ..నిబంధనల మీద మనకున్న గౌరవం. నిబంధనలున్నది మన కోసమే. మన భద్రత కోసమే.
మహామహా నిపుణులు ప్రపంచంలోని ట్రాఫిక్ వ్యవస్థలన్నిటినీ అధ్యయనం చేసి రూపొందించారు.వాటిని ఉల్లంఘించడం వల్ల వ్యవస్థకు జరిగే నష్టంకంటే వ్యక్తిగా మనకు జరిగే నష్టమే ఎక్కువ.
మత్తు మనిషిని చిత్తుచేస్తుంది. ఎంత చేయితిరిగిన చోదకుడైనా తడబడతాడు.ఆ పరిస్థితిలో అమాంతంగా ఏ డివైడర్నో గుద్దేస్తాడు,లేకపోతే పాదచారుల మీదికి దూసుకెళ్తాడు. తాను చచ్చి, ఇతరుల్ని చంపేస్తాడు. పావుసీసా మద్యం నిండు జీవితాన్ని మింగేస్తుంది.
********************
హెల్మెట్ పెట్టుకుంటాం.సీటుబెల్టు కట్టుకుంటాం.ట్రాఫిక్ నిబంధనల్ని పాటిస్తాం.అయినా కొన్నిసార్లు ప్రమాదాలు తప్పవు.అలాంటి సంక్షోభాలు ఎదురైనపుడు తట్టుకుని నిలబడాలి.అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి.
ముందుజాగ్రత్త అంటే...
ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తపడటం ఒక్కటే కాదు.హఠాత్తుగా ఇంకేదైన జరిగినా...దాన్ని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండటం.కుటుంబ సభ్యులకు ఆ శక్తినివ్వడం.ఇప్పటికే ఉంటే పర్వాలేదు, లేకపోతే మాత్రం, కుటుంబానికంతా పనికొచ్చేలా ఆరోగ్యబీమా ప్లోటర్ పాలసీ తీసుకోండి.
జీవితమంటే మరేం కాదు....
అనూహ్య సంఘటనల సమాహారం!

No comments:
Post a Comment